యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఎన్టీఆర్. బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను సితార నాగవంశీ భారీ ధరకు కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్నారు.
Also Read : Exclusive : హరిహర వీరమల్లు పార్ట్-2 షూటింగ్ ఎంతవరకు వచ్చిందంటే
కాగా వార్ 2 కు సంబంధించి ఫ్యాన్స్ కు ఆడిపోయే అప్డేట్ ఇచ్చాడు నాగవంశీ. కింగ్డమ్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ’ వార్ 2 లో ఎన్టీఆర్ ఎంట్రీకి థియేటర్లలో స్క్రీన్స్ చిరుగుతాయి. దాని గురించి ఎక్కువ రివీల్ చేయకూడదు గాని ఎన్టీఆర్ ఎంట్రీకి ఆడియెన్స్ కు గూస్ బమ్స్ గ్యారెంటీ. టైటిల్ తగ్గట్టు హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ కు మధ్య వార్ సీన్స్ విజువల్ వండర్ లా ఉంటాయి. ఇద్దరు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ నువ్వా నేనా అని వారింగ్స్ ఇచ్చుకుంటూ కొట్టుకుంటుంటే చూసేందుకు ఎలా ఉంటది అనే యాంటిసిపేషన్ మీద వార్ 2 ను కొనుగోలు చేశాను’ అని అన్నారు. నాగవంశీ కామెంట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరోవైపు వార్ 2 తెలుగు రాష్ట్రాల రిలీజ్ కు నాగవంశీ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 14న తెల్లవారుజామున షోస్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ రకంగా చుస్తే వార్ 2 తెలుగు స్టేట్స్ డే 1 భారీ నంబర్ ఉండబోతుంది.