Site icon NTV Telugu

War 2 : వార్ 2 హీరోల రెమ్యునరేషన్ లెక్కలు లీక్.. ఎన్టీఆర్ పారితోషికం చూసి నెటిజన్లు షాక్ 

War2

War2

బాలీవుడ్ న‌టుడు హృతిక్ రోషన్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ తెర‌కెక్కించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’.  య‌ష్‌ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో రాబోతున్న ఆరో చిత్రమిది. కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆగ‌స్టు 14న విడుద‌ల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రంపై అటు నార్త్ తో పాటు ఇటు సౌత్‌లోనూ భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన ట్రైల‌ర్ సినిమాపై ఉన్న హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. ఇదిలా ఉంటే.. వార్ 2 బ‌డ్జెట్‌, న‌టీన‌ట‌లు రెమ్యున‌రేష‌న్ లెక్కలు ప్రస్తుతం నెట్టింట వైర‌ల్ గా మారాయి. వినపడుతున్న సమాచారం ప్రకారం..

Also Read : Kalpika : మరో వివాదంలో నటి కల్పిక.. రిసార్ట్‌లో హంగామా..

యష్ రాజ్ ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ఆదిత్య చోప్రా దాదాపు రూ. 210 కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో మేజర్ కబీర్ ధాలివాల్ గా హృతిక్ రోష‌న్ తన పాత్రకు రూ. 48 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్నార‌ట‌. అలాగే జూనియర్ ఎన్టీఆర్ రూ. 30 కోట్లు రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేశాడ‌ని అంటున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ను ముందుండి న‌డిపించే దర్శకుడు అయాన్ ముఖర్జీ రూ. 32 కోట్లు పారితోషికం అందుకున్నారు. ఇక హీరోయిన్ గా గ్లామ‌ర్ తో పాటు యాక్షన్ స‌న్నివేశాల్లోనూ చెల‌రేగిపోయిన కియారా రూ. 15 కోట్లు పుచ్చుకున్నట్లు స‌మాచారం. అయితే ఈ లెక్కల ప్రకారం ఎన్టీఆర్‌ పారితోషికం డైరెక్టర్‌తో సమానంగా ఉండటం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version