కూలీతో బాక్సాఫీసు వేటకు సిద్ధమైంది వార్ 2. కానీ ప్రమోషన్లలో మాత్రం ఆ సినిమాతో వెనకబడింది. జస్ట్ పోస్టర్స్‌ను మాత్రమే రిలీజ్ చేస్తూ అటెన్షన్ క్రియేట్ చేయాలనుకుంటోంది కానీ.. తుస్సుమంటున్నాయి ఇలాంటి ప్రయోగాలు. జనాలు సూపర్ ఎగ్జెట్‌గా ఎదురు చూస్తున్నప్పటికీ.. ప్రమోషన్లలో ఎగ్జైట్మెంట్ కలిగించడం లేదు యష్ రాజ్ ఫిల్మ్స్. అయితే ఇప్పటి వరకు పోస్టర్లతో సరిపెట్టిన టీం.. ఈ వీకెండ్ లేదా నెక్స్ట్ వీక్ నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేయనుందట.
Also Read:HHVM : హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్స్ లిస్ట్ ఇదే
ట్రైలర్ రిలీజ్ చేసే యోచనలో ఉందని తెలుస్తోంది. ఈ ట్రైలర్ కి తాజాగా సెన్సార్ చేయించారు. హిందీ ట్రైలర్ ను రెండు నిముషాల 35 సెకన్లు ఉండేలా కట్ చేశారు. ఆ ట్రైలర్ కట్ అయితే సినిమా మీద అంచనాలు పెంచేలా ఉందని అంటున్నారు ఇంసైడ్ వర్గాలు. ఇక అలాగే స్టార్ హీరోలు హృతిక్, తారక్ కూడా రంగంలోకి దిగుతున్నారట. అయితే కలిసి కాదని సౌత్‌ని డీల్ చేసే బాధ్యత జూనియర్ ఎన్టీఆర్, నార్త్ బెల్ట్‌ను గ్రీక్ గాడ్ షేర్ చేసుకోబోతున్నారని టాక్. ఏదైమైనా వార్ 2 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు యశ్ రాజ్ సంస్థ సిద్ధమైంది.
