Site icon NTV Telugu

Coolie- War 2: ఇలా అయితే అస్సామే బాసూ?

Coolie Vs War 2

Coolie Vs War 2

మొన్న ఆగస్టు 14వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన వార్ 2 సినిమాతో పాటు రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమా రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలు రెండూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. సినిమాలు బాలేదా అంటే, బాలేదని చెప్పలేం, ఓ మాదిరిగా ఉన్నాయి. భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను ఈ సినిమాలు మెప్పించలేకపోయాయి. అయితే, సినిమా కథనం విషయం ఎలా ఉన్నా, రెండు సినిమాల విషయంలోనూ మేకింగ్ కీలక పాత్ర పోషించింది. మేకింగ్ స్టాండర్డ్స్ గురించి కూడా చర్చ జరిగింది.

Also Read:Tollywood Producers :దిగివచ్చేందుకు సిద్దమైన ఫెడరేషన్..ఛాంబర్లో నిర్మాతల అత్యవసర సమావేశం?

అయితే, ఇక్కడే సినిమా హీరోల రెమ్యూనరేషన్ చర్చ మరోసారి తెరమీదకు వచ్చింది. ఎందుకంటే, కూలీ సినిమా బడ్జెట్ 350 కోట్ల రూపాయలు అయితే, అందులో రజనీకాంత్‌కు 150 నుంచి 200 కోట్ల వరకు వెచ్చించారట. నాగార్జున, ఆమిర్ ఖాన్ సహా దర్శకుడు, ఇతర టెక్నీషియన్ల ఖర్చులు చూసుకుంటే, అవే మరొక 100 కోట్ల దాకా ఉన్నాయని అంటున్నారు. చివరికి కేవలం 35 కోట్లు మాత్రమే మేకింగ్ కోసం ఖర్చు పెట్టారని, అందువల్లే ప్రోడక్ట్ ఆశించినంత బాగా రాలేదనే వాదన తెరమీదకు వస్తోంది. వార్ 2 విషయానికి వస్తే కూడా దాదాపు అదే చర్చ జరుగుతోంది. ఆ సినిమాకు 400 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే, అందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికీ కలిపి దాదాపు 200 కోట్ల రూపాయలు ఇచ్చేశారట.

Also Read:V.N Adithya: ఎవడికిరా నష్టం.. అడుక్కు తినాల్సి వస్తుంది జాగ్రత్త.. సినీ సమ్మెపై దర్శకుడు సంచలనం

మిగతా 200 కోట్లతో డైరెక్టర్ సహా ఇతర టెక్నీషియన్లు, మేకింగ్ కోసం ఖర్చు చేశారని అంటున్నారు. అదే రెమ్యూనరేషన్ కాస్త తగ్గించి, సినిమా మేకింగ్ మీద ఖర్చు పెట్టి, తర్వాత వచ్చే లాభాలను హీరోలకు ఇచ్చేలా మాట్లాడుకుని ఉంటే, రిజల్ట్ వేరేలా ఉండేదని అంటున్నారు. నిజంగా 15 కోట్ల రూపాయలతో చేసిన మహా అవతార్ నరసింహ అనే సినిమా ఇప్పటికే దాదాపు 300 కోట్ల రూపాయల కలెక్షన్ల దిశగా పరుగులు పెడుతోంది. కంటెంట్ బాగుంటే బడ అని చూడకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కాబట్టి, రెమ్యూనరేషన్ల మీద పెట్టే దృష్టిని కంటెంట్ మీద, ముఖ్యంగా మేకింగ్ మీద పెడితే, కచ్చితంగా ఆ సినిమాలు వర్క్ అవుట్ అవుతాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే, ఇకమీద అన్ని సినిమాలు అస్సాం అన్నట్టు తయారవుతాయని అంటున్నారు.

Exit mobile version