NTV Telugu Site icon

VJS – Trisha : బ్లాక్ బస్టర్ సినిమాకు పార్ట్ – 2 రాబోతుంది.. షూటింగ్ ఎప్పుడంటే..?

Untitled Design (15)

Untitled Design (15)

చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా సిక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఎక్కడ చూసిన హిట్ సినిమాలకు సిక్వెల్స్ తెరకెక్కుతున్నాయి. ఇటీవల ఇస్మార్ట్ 2, హిందీ లో స్త్రీ – 2, డిమాంటి కాలిని 2 వంటి సినిమాలు వచ్చాయి. అలాగే సలార్ 2, కల్కి -2, దేవర -2, జైలర్ -2 సినిమాల రెండవ భాగాలు తెరకెక్కబోతున్నాయి. ఈ కోవలోనే తమిళ చిత్ర పరిశ్రమలో మరోక బ్లాక్ బస్టర్ సినిమాకు పార్ట్ – 2 ను నిర్మించనున్నారు. ఈ న్యూస్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read : Devara : దేవర ఆంధ్ర – నైజాం – సీడెడ్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు ఇవిగో..

ఇంతకీ ఆ సినిమా ఏదంటే 96. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, అందాల తార త్రిష కాంబోలో 2018 లో ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన క్యూట్ లవ్ స్టోరీ 96. గోవింద్ వసంత్ సంగీత అందిచిన ఈ సినిమా మ్యూజికల్ గా ఎంతటి సంచలనం చేసిందో చెప్పక్కర్లేదు. స్కూల్ డేస్ లో ప్రేమించుకుని, విడిపోయి ఓ 25 ఇయర్స్  స్కూల్ తర్వాత  గెట్ టు గెదర్ లో కలుసుకున్నాప్పుడు వారి మధ్య జరిగన  ఓ డిఫ్రెంట్ లవ్ స్టారి 96. విజయ్ సేతుపతి, త్రిష మధ్య కెమిస్ట్రీ సినిమాను సూపర్ హిట్ గా నిలబెట్టింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సిక్వెల్ ను తెరకెక్కించనున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ” 96 – 2 కు సంబంధించిన స్క్రిప్టింగ్ కూడా పూర్తయింది. నన్ను ఎంతగానో ఎగ్జైట్ చేసిన సినిమా అది. ఇప్పటికే విజయ్ సేతుపతి సతీమణి కు కథ చెప్పాను. విజయ్ సేతుపతి & త్రిష డేట్స్ ఆధారంగా సినిమా మెటీరియలైజ్ అవుతుంది” అని అన్నారు

Show comments