Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే లాభాలు

Vishwanadh And Sons Business

Vishwanadh And Sons Business

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా మమిత బైజు కీలకపాత్రలో నటించిన భారీ చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్’. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ఉదయం ఆటతో వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సాంగ్స్ సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్ బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డు స్థాయి వసూళ్లను సాధించేలా కనిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా భారీ ప్రీ రిలీజ్ ట్రేడ్ వర్గాల్లో పెద్ద సంచలనం సృష్టిస్తోంది.

రూ. 130 కోట్ల బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు రూ.90 కోట్లకు అమ్ముడుకాగా నాన్-థియేట్రికల్ (డిజిటల్, శాటిలైట్, ఆడియో) హక్కులు: రూ.125 కోట్లు పలికాయి. మొత్తంగా ప్రీ-రిలీజ్ బిజినెస్ రూపంలో రూ.215 కోట్లు రాబట్టింది.  ఈ బిజినెస్ లెక్కలతో సినిమా విడుదల కాకముందే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థకు ఏకంగా రూ.85 కోట్ల భారీ టేబుల్ ప్రాఫిట్ దక్కినట్లయింది. టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలోని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమా రిలీజ్ కు ముందే లాభాల బాట పట్టింది. ఇటీవల ఈ సంస్థ నిర్మించిన ‘ లెనిన్’ భారీ వసూళ్లు రాబట్టి అఖిల్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సాధించిన ఈ కమర్షియల్ బిజినెస్ మరో ల్యాండ్‌మార్క్ మూవీగా నిలవనుంది.