Site icon NTV Telugu

Funky : ముందుకొచ్చిన ‘ఫంకీ’.. రిలీజ్ ఎప్పుడంటే?

Funky

Funky

విశ్వక్ సేన్, కె.వి. అనుదీప్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫంకీ’ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తొలుత ‘ఫంకీ’ చిత్రాన్ని 2026 ఏప్రిల్‌లో వేసవి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావించినప్పటికీ, విడుదల తేదీని ముందుకు జరుపుతూ చిత్ర బృందం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. 2026 ఫిబ్రవరి 13న సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. అంటే, వాలెంటైన్స్ డే (ప్రేమికుల దినోత్సవం) వీకెండ్‌ను ఒక రోజు ముందుగానే ‘ఫంకీ’ నవ్వుల సందడితో ప్రారంభించబోతోంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఒక సినీ దర్శకుడి పాత్ర పోషిస్తుండటం విశేషం. కొత్త లుక్, అసాధారణమైన యాటిట్యూడ్‌తో ఆయన ప్రేక్షకులను సరికొత్తగా అలరించనున్నారు.

Also Read:Annagaru Vostaru : కార్తీ సినిమాకి కొత్త టెన్షన్?

ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న కయాదు లోహర్‌ తన అందం, నటనతో యువత దృష్టిని ఆకర్షించారు. తెరపై విశ్వక్-కయాదు జోడి చూడముచ్చటగా కనిపిస్తూ, ఇప్పటికే యువ ప్రేక్షకులలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ చిత్రానికి సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో అదనపు ఆకర్షణగా నిలవనున్నారు. టీజర్‌లో వినిపించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను పెంచింది. ఈ చిత్రానికి సురేష్ సారంగం ఛాయాగ్రాహకుడిగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version