Site icon NTV Telugu

Vishwambhara : భళారే విశ్వంభర.. వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్

Chiru

Chiru

మెగాస్టార్ చిరంజీవి నటిస్తునం భారీ బడ్జెట్ సినిమా విశ్వంభర. బింబిసారా దర్శకుడు వసిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటాషి నేపథ్యంలో తెరకెక్కుతుంది. చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది. కానీ తర్వాత వచ్చిన విశ్వంభర ఫస్ట్ గ్లిమ్స్ మిశ్రమ స్పందన రాబట్టింది. మరి ముఖ్యంగా VFX వర్క్ పట్ల దారుణమైన ట్రోలింగ్ జరిగింది. అటు ఫ్యాన్స్ ను కూడా విశ్వంభర ట్రైలర్ నిరుత్సహపరిచింది.

Also Read : Off The Record: వల్లభనేని వంశీని ఓవర్ కాన్ఫిడెన్సే దెబ్బ కొట్టిందా? ఉచ్చు బిగుస్తుందా?

దింతో రంగంలోకి దిగిన మెగాస్టార్ యూనిట్ కు కీలక సూచనలు చేసారు. ఇప్పటి వరకు VFX వర్క్ చేసిన టీమ్ ను మొత్తం మార్చి మరొక టీమ్ కు వర్క్ అప్పగిచారు. ప్రజెంట్ చేస్తున్న టీమ్ వర్క్ పట్ల యూనిట్ పాజిటివ్ గానే ఉందని తెలుస్తుంది. అనుదుకు నిదర్శనం ఇటీవల విశ్వంభర నుండి రిలీజ్ పోస్టర్. ఈ పోస్టర్ లో చిరంజీవి లుక్ వింటేజ్ చిరును తలపించాయడంలో మారు మాట లేదు. సోషియో ఫాంటాసి కథ నేపధ్యం కావడంతో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది అందుకే క్వాలిటిలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుడదని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో మెగా స్టార్ ఫ్యాన్స్ విశ్వంభరపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సినిమా రాబోతోందని అభిమానులు భావిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విశ్వంభర వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

Exit mobile version