Vishwambhara : అదిగో విశ్వంభర.. ఇదిగో రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది ఆరంభంలోనే ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇదే జోష్‌లో తదుపరి చిత్రాన్ని దర్శకుడు బాబీ దర్శకత్వంలో పట్టాలెక్కించేశారు. రీసెంట్గా గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ సినిమా మరుసటి రోజు నుంచే షూటింగ్ మొదలుపెట్టుకుని ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కానీ అప్పుడెప్పుడో మొదలైన మెగాస్టార్ ‘విశ్వంభర’ పరిస్థితేంటి? ఏంటి అంటే క్లారిటీ లేకుండాపోయింది. చెప్పాలంటే మెగా అభిమానులు ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని దాదాపుగా మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది.
‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై మొదట్లో భారీ అంచనాలు ఉండేవి. కానీ గ్రాఫిక్స్ వర్క్ డిలే కారణంగా గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ ఊసే వినిపించడం లేదు. ఆ మధ్యన సమ్మర్లో రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు మేకర్స్. కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కూడా వెళ్లిపోతోంది అయినా కూడా ఇంతవరకు విడుదల తేదీపై ఎలాంటి క్లారిటీ లేకపోవడం గమనార్హం. కనీసం సినిమా రిలీజ్ ఎప్పుడు? టీజర్ లేదా సాంగ్స్ అప్డేట్స్ ఎప్పుడు? అనే కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. దీనివల్ల ఈ సినిమా బజ్ క్రమంగా తగ్గిపోతోందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా కేవలం VFX పనుల వల్ల ఆలస్యమవుతోందా? లేక మరేదైనా కారణమా అనేది? హాట్ టాపిక్‌గా మారింది. మరి ‘విశ్వంభర’ పరిస్థితేంటో మేకర్స్‌కే తెలియాలి.
Also Read
తాజావార్తలు
-
Vishwambhara : అదిగో విశ్వంభర.. ఇదిగో రిలీజ్
-
TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
-
August Box Office: టాలీవుడ్లో హీట్ పెంచనున్న ఆగస్టు రిలీజ్లు.. నాని Vs రవితేజ Vs శర్వా!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
Rowdy Janardhana : రౌడీ కోసం ‘కన్నప్ప’ బ్యూటీ
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!