NTV Telugu Site icon

Vishwam : చడీ చప్పుడు లేకుండా ఓటీటీలో దిగిన ‘విశ్వం’

Viswam

Viswam

మాచో స్టార్ గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య దసరా కానుకగా రిలీజైన సినిమా విశ్వం. చాలా రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు గోపీచంద్. అటుశ్రీను వైట్ల కూడా ఎలాగైనా హిట్ కొట్టి తన పని అవ్వలేడనై నిరూపించుకోవాలి చూస్తున్న టైమ్ లో వచ్చింది విశ్వం. గోపీచంద్, శ్రీనువైట్ల కలిసి చేసిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సమయంలో శ్రీనువైట్ల తన సేఫ్ జోన్ లో సినిమాను తెస్తున్నాడనే కామెంట్స్ వినిపించాయి.

Also Read : Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. స్పిరిట్ మెుదలెట్టారు..

థియేటర్లో విడుదలైన ఈ సినిమా  పర్వాలేదు అనే టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా బి, సి సెంటర్స్ లో పండుగ సీజన్ ని క్యాష్ చేసుకుంది విశ్వం. తెలుగు రాష్ట్రాల్లో ని ఒకటి అరా తప్పించి అన్ని ఏరియాల్లో విశ్వం బ్రేక్ ఈవెన్ సాధించింది. కాగా ఈ సినిమా ఇప్పుడు చడీ చప్పడు లేకుండా ఓటీటీలోకి అడుగుపెట్టింది. గత రాత్రి ఈ సినిమాను ఎటువంటి హంగామా లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో  స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చింది. కేవలం థియేటర్లో రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. రెండు తెలుగు స్టేట్స్ లో కేవలం రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించినట్టు అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియెస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా వరుస దారుణ పరాజయాలతో సతమతమవుతున్న దర్శకుడు శ్రీను వైట్ల, గోపీచంద్ కు కాస్త రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. మరో ఓటీటీ లో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

 

Show comments