Laila : ‘లైలా’ యూత్ ఫుల్ ఎంటర్టైనర్.. నా కెరీర్ లో మెమరబుల్ మూవీ : విశ్వక్సేన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’ ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్సేన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
లేడీ గెటప్ చేయాలనే కోరిక మీకు ముందునుంచి ఉండదని విన్నాం?
-ఆర్టిస్ట్ గా కొన్ని పాత్రలు చేయాలని ప్రతి నటుడికి ఉంటుంది. భామనే సత్యభామనే, మేడం, చిత్రం భళారే విచిత్రం, రెమో సినిమాలు చూసినప్పుడు ఆర్టిస్టుగా ఇలాంటి గెటప్ చేయాలని ఉండేది. అలాగే ఆడియన్స్ ఇప్పుడు కొత్త కథలని, థీమ్స్ ని కోరుకుంటున్నారు. ఇలాంటి సినిమాలురాక దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతుంది. ఈ జనరేషన్ లో ఒక హీరో అమ్మాయి పాత్ర వేయడం గత 20 ఏళ్లుగా మనం చూడలేదు. ఆ లోటుని భర్తీ చేయాలని ఒక మంచి కథ రావడంతో ఈ సినిమా చేయడం జరిగింది.
Also Read
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- JanaNayagan : విజయ్ 'జననాయగన్'.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
- Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
లేడీ గెటప్ లోకి మారడానికి మీకు ఎంత సమయం పట్టింది?
-దాదాపు రెండున్నర గంటలు పట్టేది. మేకప్ ఆర్టిస్ట్ నిక్కీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. లేడీ గెటప్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేలా ఉండదు. చాలా నేచురల్ గా వచ్చింది.
ట్రైలర్లో ఎక్కువ అడల్ట్ కంటెంట్ కనిపిస్తుంది ?
అడల్ట్ కాదండి. ఇది యూత్ ఫుల్ కంటెంట్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్.
ఈ కథ విన్న్నప్పుడు మీ ఇనిషియల్ ఇంప్రెషన్ ఏంటి ?
-కథ చెప్పినంత సేపు విపరీతంగా ఎంజాయ్ చేశాను. ఇలాంటి నవ్వులు జనాలకి ఎందుకు ఇవ్వకూదని అనిపించింది. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ చాలా సీరియస్ గానే వింటాను. కానీ ఈ కథ విన్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేశాను.
మీరు కాంపౌండ్ కామెంట్ విషయంలో ఇచ్చిన సమాధానం గురించి చిరంజీవి గారు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రస్తావించడం ఎలా అనిపించింది?
-నాకు చాలా ముచ్చటేసింది, నేను అక్కడితో అది ఎండ్ అయిపోయింది అనుకున్నాను. కానీ నా ఉద్దేశాన్ని చిరంజీవి గారు కూడా ప్రస్తావించడం చాలా ఆనందంగా అనిపించింది. అందరం అందర్నీ సపోర్ట్ చేసుకోవాలి. అంతిమంగా మనం మంచి సినిమాల్ని ఆడియన్స్ ఇవ్వాలి. సినిమా మీద ప్రేమతోనే అందరం ప్రయాణిస్తున్నాం.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ?
ఈ మంత్ ఎండ్ నటులని పరిచయం చేస్తున్నాం. ఫంకీ మూవీ ఇమ్మిడియట్ గా స్టార్ట్ చేస్తున్నాం.
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..