Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి తనలోని డైరెక్టర్‌కు పదునుపెట్టాడు. ఎప్పుడూ రొటీన్ కు భిన్నంగా ఆలోచించే ఈ యంగ్ హీరో, ఈసారి ఏకంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎవరూ టచ్ చేయని ఓ భయానకమైన జానర్‌ను ఎంచుకుని ఇండస్ట్రీని షేక్ చేయడానికి సిద్ధమయ్యాడు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న గ్లోబల్ స్లాషర్ ఫిల్మ్ #కల్ట్ (CULT). ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ సినిమా కోసం మేకర్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోని విధంగా వందలాది మోడల్స్‌తో దాదాపు 40 నుంచి 50 రోజుల పాటు ఇక్కడే కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ యాక్షన్ అండ్ స్లాషర్ ఎపిసోడ్స్ థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా చెబుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రాగా, దానికి తోడు ఇప్పుడు షూటింగ్ కూడా పూర్తి కావడంతో అక్టోబర్ 30న ఈ కల్ట్ జాతరను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ ఏరికోరి మరీ ఇండియాలోని టాప్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దించాడు. ‘కె.జి.ఎఫ్’, ‘సలార్’ లాంటి సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ కు వణుకుపుట్టించిన సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ చిత్రానికి అదిరిపోయే బీజీఎం అందిస్తున్నాడు. ఇక బాలీవుడ్ కల్ట్ మూవీ ‘యానిమల్’ కు తన సౌండ్ డిజైన్ తో ప్రాణం పోసిన సచిన్ ఈ సినిమాకు పని చేయడం మరో విశేషం. దీనికి తోడు జెన్-జీ (GenZ) యూత్ కు కనెక్ట్ అయ్యేలా సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రాసిన పదునైన మాటలు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. తారక్ సినిమా బ్యానర్ పై సందీప్ కాకరాల అత్యంత భారీ బడ్జెట్ తో, లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ సరసన గాయత్రి భరద్వాజ్ నటిస్తుండగా, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, పుష్ప ఫేమ్ తారక్ పొన్నప్ప, ప్రజ్ఞ లాంటి ప్రముఖులు ఈ కల్ట్ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇండియన్ భాషలతో పాటుగా విదేశీ భాషల్లోనూ రిలీజ్ కాబోతున్న ఈ ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ మూవీ అక్టోబర్ 30న ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!