NTV Telugu Site icon

Kannappa: కన్నప్ప స్వగ్రామంలోని శివాలయాన్ని సందర్శించిన విష్ణు మంచు

Kannappa Voshm

Kannappa Voshm

విష్ణు మంచు నటిస్తున్న కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25, 2025న విడుదల కానుంది. మోహన్ బాబు నిర్మాణ సారథ్యంలో, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ద్వారా ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తించింది. ఇప్పటివరకు విడుదలైన రెండు టీజర్‌లు, పాటలు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపాయి. సినిమా రిలీజ్‌కు ముందు ద్వాదశ జ్యోతిర్లింగాలను సందర్శిస్తానని విష్ణు మంచు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, విష్ణు మంచు భక్త కన్నప్ప స్వగ్రామమైన అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని ఊటుకూరుకు వెళ్లారు. అక్కడి గ్రామస్థులు, ఆలయ సిబ్బంది విష్ణు మంచు మరియు కన్నప్ప బృందానికి ఘన స్వాగతం పలికారు.

Chiranjeevi : చిరంజీవి-అనిల్ మూవీలో హీరోయిన్ ఆమెనేనా..?

ఈ సందర్భంగా విష్ణు మంచు కన్నప్ప స్వగృహాన్ని సందర్శించారు. అక్కడి శివాలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ శివాలయాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని విష్ణు మంచు హామీ ఇచ్చారు. ఈ సందర్శన ద్వారా కన్నప్ప చిత్రం ఆధ్యాత్మిక నేపథ్యాన్ని మరింత హైలైట్ చేశారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్‌లాల్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న కన్నప్ప, విష్ణు మంచు కెరీర్‌లో మైలురాయిగా నిలవనుంది. ఏప్రిల్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.