NTV Telugu Site icon

Manchu Vishnu : కూతురు పుట్టినరోజు.. నటీనటులకు మంచు విష్ణు 10 లక్షల విరాళం

Manchu Vishnu

Manchu Vishnu

Vishnu Manchu donates 10 lakhs on daughter Ayra Vidya Manchu’s birthday: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు విష్ణు మంచు తన కూతురు ఐరా విద్య మంచు పుట్టిన రోజు సందర్భంగా పది లక్షల విరాళాన్ని ప్రకటించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఆర్థికంగా వెనుకబడిన నటీనటుల సంక్షేమం కోసం పది లక్షలు విరాళంగా అందించారు. నటీనటులకు సహాయం చేయడం, వారికి అవసరమైన సపోర్ట్, సంరక్షణ అందేలా చేయడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చించనున్నామని ఆయన టీం ప్రకటించింది. గత మూడు సంవత్సరాలలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విష్ణు నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి సాధించింది.

Murari 4K: ఇదేందయ్యా ఇదీ.. కొత్త సినిమా కంటే మురారి రీ రిలీజ్ ఎక్కువ కొల్లగొట్టిందే?

మా భవనంపై విష్ణు మంచు ఫోకస్ పెట్టడమే కాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్లు, సినీ ఆర్టిస్టుల మీద సోషల్ మీడియాలో వచ్చే అసత్య కథనాలు, ట్రోలింగ్‌ కట్టడి చేసేందుకు నడుంబిగించారు. నటీనటులు వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది యూట్యూబర్‌లు పోస్ట్ చేసిన అసభ్యకరమైన, అవమానకరమైన కంటెంట్‌ను తీసి వేయించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. విష్ణు చేపట్టిన ఈ చర్యలను ఇతర ఇండస్ట్రీలకు చెందిన ఆర్టిస్టులు కూడా ప్రశంసించారని టీం వెల్లడించింది. ఇక మరోపక్క విష్ణు మంచు ప్రస్తుతం ‘కన్నప్ప’ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ డిసెంబర్ 2024లో విడుదల కానుంది. భారీ తారాగణంతో రాబోతోన్న కన్నప్పపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

Show comments