Site icon NTV Telugu

మరోసారి షూటింగ్‌లో గాయపడ్డ విశాల్

త‌మిళ హీరో విశాల్ ‘నాట్ ఎ కామ‌న్ మ్యాన్‌’ సినిమా షూటింగ్ లో మరోసారి గాయపడ్డాడు. ప్ర‌స్తుతం క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తోన్న స‌మ‌యంలో ఆయ‌న‌ గోడను ఢీకొని ప‌డిపోవ‌డంతో తీవ్ర గాయమైంది. దీంతో విశాల్‌ వెన్ను భాగానికి దెబ్బతగిలింది. ప్ర‌స్తుతం వైద్యులు చికిత్స చేస్తున్నార‌ని, విశాల్ ఆరోగ్యంగానే ఉన్నార‌ని టీమ్ స‌భ్యులు తెలిపారు. శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో విశాల్ గాయపడడం ఇది రెండోసారి. ఇదివరకు తలకు స్వల్ప గాయాలతో విశాల్ బయటపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

Exit mobile version