Site icon NTV Telugu

ZEE5 vs Etv Win : వాళ్లే తొందరపడ్డారు.. అంతా కోర్టు చూసుకుంటుంది!

Zee5

Zee5

విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ అనే ఒక వెబ్ సిరీస్ తాము చేయాలనుకున్న కథతోనే కాపీ కొట్టి చేశారని ఈటీవీ విన్‌కి సంబంధించి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ డైరెక్టర్ ప్రశాంత్ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసింది. ఈ విషయం ఇప్పటికే జీ5 ఒక ప్రెస్ నోట్ ద్వారా స్పందించింది కూడా. ఇప్పుడు తాజాగా ఈ విరాటపాలెం సక్సెస్ మీట్‌కి వచ్చిన టీం ఈ ఆరోపణల మీద పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చింది. నిజానికి ఆదర్శకుడితో సిరీస్ చేయాలనుకున్న మాట వాస్తవమే. 8 నెలలపాటు స్క్రిప్ట్ కోసం అంతా పనిచేశారు.

Also Read:Naga chaitanya: శోభితతో జీవితం సంతోషంగా సాగుతుంది..

8 నెలల తర్వాత వర్కౌట్ కావడం లేదని మేము సిరీస్ చేయలేమని చెబితే, ఆయన అదే కథతో ఈటీవీ విన్‌లో చేయడానికి వెళ్లారు. అయితే ఆ కథ ఇప్పుడు మేము చేసిన విరాటపాలెం కథ కాదు, పూర్తిగా వేరు. ఎందుకంటే మా దగ్గర ఆ కథ ఉంది. విరాటపాలెం ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది కాబట్టి వారు ముందుగా కాల్ చేసినప్పుడు రెండు కథలు వేరని చెప్పాము. తర్వాత మేము లీగల్‌గా ముందుకు వెళ్తామని అన్న తర్వాత మేము ఫోన్లు ఎత్తడం మానేశాం. ఎందుకంటే ఒకసారి లీగల్ అనే మాట వచ్చాక కార్పొరేట్‌లో లీగల్ టీమ్స్ ఎంటర్ అవుతాయి. కోర్టుకు వెళ్లారు.

Also Read:Kannappa : కన్నప్ప డే 1 కలెక్షన్స్… ఎంతంటే?

కోర్టు ఒక రోజు స్క్రీనింగ్ వేయాలని ఆదేశించింది. వారికి స్క్రీనింగ్ వేయడానికి సిద్ధమైతే, ఆ ముందు రోజు స్క్రీనింగ్ చూడకుండానే మీడియా ముందుకు వచ్చి మా మీద ఆరోపణలు చేశారు. ఈ విషయం కోర్టులో ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. వారే తొందరపడి ప్రెస్ మీట్ పెట్టారు. మా మీద చేసిన ఆరోపణలకు డెఫమేషన్ కేసు వేసాం. కోర్టు కచ్చితంగా మాకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందని జీ5 టీం తెలిపింది. ఇక అభిగ్న ప్రధాన పాత్రలో ఈ విరాటపాలెం అనే ఒక వెబ్ సిరీస్ రూపొందించారు డైరెక్టర్ కృష్ణ పోలూరు. శ్రీరామ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సిరీస్ తమ లేటెస్ట్ హిట్ సిరీస్ రెక్కీకి డబుల్ వ్యూయర్‌షిప్ తెచ్చుకుందని జీ5 టీం చెబుతోంది.

Exit mobile version