విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చే టైం వచ్చేసిందా? తాజా లక్స్ యాడ్ చూస్తే మీకూ అదే అనుమానం కలుగుతుంది! భార్య అనుష్క శర్మతో కలసి లుక్స్ సబ్బు ప్రచారం కోసం రొమాన్స్ లో మునిగిపోయాడు టీమిండియా కెప్టెన్! అంతే కాదు, విరాట్ యాడ్స్ లో నటించటం ఇప్పుడు కొత్త కాకపోయినా ఈసారి చాలా డిఫరెంట్ గా ఎంటర్టైన్ చేశాడు ఫ్యాన్స్ ని. మిసెస్ అనుష్కని ఓ క్లాసిక్ బాలీవుడ్ సాంగ్ తో అందంగా పొగిడేశాడు. ‘కాశ్మీర్ కీ కలీ’ సినిమాలోని ‘యే చాంద్ స రోషన్ చెహ్రా’ పాటకి లిప్ సింక్ కూడా చేశాడు. అక్కడితో ఆగకుండా పింక్ డ్రస్ లో వెలిగిపోతోన్న అనూతో స్టెప్పుల్ని సింక్ చేశాడు. అలనాటి శమ్మీ కపూర్, షర్మిలా ఠాగూర్ జోడీని గుర్తు చేశారు విరుష్క!
విరాట్ ని పెళ్లాడిన అనుష్క ఈ మధ్యే ఓ పాపకి జన్మనిచ్చింది. ప్రెగ్నెంట్ గా ఉంటూ కూడా యాడ్స్ లో కనిపించిన బాలీవుడ్ బ్యూటీ డెలివరీ తరువాత లక్స్ సోప్ యాడ్ లో కనిపించింది. విరాట్ కూడా ఆమెతో కలసి లక్స్ బ్రాండ్ ని ప్రమోట్ చేశాడు. చూడాలి మరి, ఈ యాడ్ లో మాదిరిగా పెద్ద తెరపై కూడా విరాట్ భవిష్యత్తులో ఎప్పుడైనా అనుష్కతో బాలీవుడ్ రొమాన్స్ నడుపుతాడేమో…
A post shared by Virat Kohli (@virat.kohli)