రీతు చౌదరి కాదు, రోత చౌదరి అనిపించుకునేలా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. వనం దివ్య అలియాస్ రీతు చౌదరి, తెలుగులో కొన్ని సీరియల్స్ చేస్తూ నటీగా పేరు తెచ్చుకుంది. ఒకరకంగా నటిగా పేరు తెచ్చుకుంది అనడం కంటే, అప్పుడెప్పుడో ఒక సింగింగ్ షోలో సింగర్‌కి హగ్ ఇచ్చి ఓవర్‌నైట్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవతారమెత్తింది. ఇంకేముంది, ప్రమోషన్లకు ప్రమోషన్లు లక్షలకు లక్షల డబ్బు వచ్చి పడింది. అప్పట్లో వైసీపీకి సన్నిహితంగా మెలిగిన శ్రీకాంత్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుని, అక్రమ ఆస్తుల కేసులో ఇరుక్కుంది. ఇప్పుడు భార్యను టార్చర్ చేస్తూ ఆమె వ్యాపారం లాక్కున్నట్టుగా కేసు నమోదైన హీరో ధర్మ మహేష్‌తో ఉన్న అక్రమ సంబంధం బయట పడినట్లుగా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Also Read :Rain Alert : OG ఈవెంట్ సేఫేనా..? ఆ ఏరియాల్లో భారీ వర్షం..
ధర్మ మహేష్‌తో కలిసి అతని బెడ్‌రూమ్ లోకి వెళుతున్న, తర్వాత డ్రగ్స్ తీసుకుని మత్తులో తూలుతూ బయటకు వస్తున్న వీడియోలు కొన్ని మీడియాకి చిక్కాయి. ధర్మ మహేష్ భార్య గౌతమి, గత కొద్దిరోజులుగా మీడియా ముందుకు వచ్చి తన భర్త బండారం బయటపెట్టి తన గోడు వెళ్లబోసుకుంటుంది. ఇప్పుడు ఏకంగా రీతు చౌదరితో కలిసి ధర్మ మహేష్ ఉన్న వీడియోలు బయట పెట్టడంతో, ఒక్కసారిగా తెలుగు టీవీ వరల్డ్ ఒక్కసారిగా షాక్‌కి గురైంది. అయితే వారిద్దరి మధ్య నిజంగా అక్రమ సంబంధం ఉందా, లేక డ్రగ్స్ తీసుకోవడం కోసమే కలిసారా అనే విషయం మీద చర్చ మొదలైంది. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో ఇవేవీ పట్టనట్టు, ఒకపక్క డెమోన్ పవన్ మరోపక్క పవన్ కళ్యాణ్‌తో సన్నిహితంగా మెలుగుతూ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది రీతు చౌదరి. ఒకవేళ నిజంగానే ఇది డ్రగ్స్ వ్యవహారం అయితే, బిగ్ బాస్ షో మధ్యలో నుంచి కూడా ఆమెను పంపే అవకాశాలు లేకపోలేదు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది.
