NTV Telugu Site icon

Vinaro Bhagyamu Vishnu Katha: కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ టీజర్ విడుదల

Vinaro Bhagyamu Vishnu Katha

Vinaro Bhagyamu Vishnu Katha

Vinaro Bhagyamu Vishnu Katha: అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. బ‌న్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్,18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా “వినరో భాగ్యము విష్ణు కథ”. కిర‌ణ్ అబ్బ‌వ‌రం సరసన క‌శ్మీర ప‌ర్ధేశీ నటిస్తోంది. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు. ఇదివరకే ఈ చిత్రం నుండి రిలీజైన “వాసవసుహాస” పాటకు కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Read also: Somesh Kumar: సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందే.. హైకోర్టు ఆదేశం

తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. టీజర్ మొదటి నుండి చివరివరకు ఆసక్తికరంగా మలిచారు. లవ్, కామెడీ , థిల్లర్ అన్ని సమపాళ్లలో ఉన్నట్లు అనిపిస్తుంది ఈ చిత్ర టీజర్. ముఖ్యంగా విష్ణు పాత్రలో కిరణ్ అబ్బవరం తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించనున్నాడు. “కాన్సెప్ట్ తో మొదలై లవ్వు కామెడీ మిక్సయి క్రైమ్ నుంచి సస్పన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అనుకోవచ్చు” అని కిరణ్ చెప్పిన డైలాగ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయింది ఈ టీజర్. ఈ సినిమాలో మురళీ శర్మ పాత్ర ఆకట్టుకోనుంది అని అర్ధమవుతుంది ఈ టీజర్ చూస్తుంటే. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌త్య‌గమిడి, శ‌రత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాత‌లు ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది.
Fake Visa: వీసాల పేరిట భారీ మోసం.. 2 కోట్లతో ఏజెంట్ పరార్‌