NTV Telugu Site icon

Vikram: విక్రమ్ తంగలాన్ సెన్సార్ రివ్యూ.. టాక్ ఎలా ఉంది అంటే.?

Untitled Design (5)

Untitled Design (5)

విభిన్నమైన కథలతో, తన నటనతో సినిమాలు చేస్తూ ఉన్నారు విక్రమ్. హిట్లు ఫ్లాప్ లను పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నాడు చియాన్. వాస్తవానికి శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు విక్రమ్ కెరీర్ లో వచ్చిన లాస్ట్ బిగ్గెస్ట్ హిట్. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించినా కూడా అవేవి ఆ స్థాయి హిట్ ఇవ్వలేదు. అయినా సరే విక్రమ్ కు ఆఫర్లు ఎక్కడా తగ్గలేదు. విక్రమ్ తాజా చిత్రం ‘తంగలాన్’. పాన్ ఇండియా లెవెల్ లో రానున్న ఈ చిత్రాన్ని పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు దర్శకుడు పా.రంజిత్‌. ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

తాజాగా తంగలాన్ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు సభ్యులు ‘తంగలాన్’ కు చిన్న చిన్న కట్స్ మరియు అక్కడక్కడా మ్యూట్ తో యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసి చిత్ర యూనిట్ ను సెన్సార్ సభ్యులు అభినందించారు.  కాగా తంగలాన్ చిత్రం 2 గంటల 36 నిమిషాల 59 సెకండ్ల రన్‌టైమ్‌ తో విడుదల కానుంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం అన్ని అవాంతారాలు దాటి ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ కానుంది.

కోలార్ బంగారు గనుల నేపథ్యంలో ఈ కథ బ్రిటీష్ కాలంనాటి కథాశంతో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో పార్వతి, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటించారు. యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కే.ఈ జ్ఞానవేల్ రాజా దాదాపు రూ. 100 కోట్లతో నిర్మించారు. తమిళ్ తో పాటు తెలుగులో రిలీజ్ అవనున్న ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీస్ విడుదల చేస్తోంది.

Also Read: Rajni: ఈ వయసులో కూడా రచ్చ లేపుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్..ఎన్ని సినిమాలు చేస్తున్నాడో తెలుసా..?