నటుడు విజయ్ వర్మ గురించి పరిచయం అక్కర్లేదు. ఎక్కువగా బాలీవుడ్ నటుడిగానే చాలా మందికి తెలుసు. కానీ ఆయన పక్కా హైదరాబాదీ. విజయ్ వర్మ తెలుగులో నటించిన ఒకే ఒక చిత్రం ‘ఎంసీఏ’ 2017 లో విడుదలైంది. ‘పెంక్’, ‘గల్లీ బాయ్’, ‘డార్లింగ్స్’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌ల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ వర్మ ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు, సిరీస్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కొన్ని పంచుకున్నాడు.
Also Read : Anirudh : ఓవర్‌గా డిమాండ్ చేస్తున్నా అనిరుథ్ ..!
‘నా ఫ్యామిలి చాలా స్ట్రిట్‌గా ఉంటుంది. నాకు యాక్టర్ అవాలని చిన్నప్పటి నుంచి కోరిక. ఇందుకోసం తగిన శిక్షణ తప్పకుండా తీసుకోవాలి. కానీ మా ఇంట్లో వాళ్లకు అది ఏమాత్రం నచ్చలేదు. ముఖ్యంగా మా నాన్న అంత స్నేహంగా ఉండేవారు కాదు. పిల్లలు క్రమశిక్షణగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. అందుకే ఎవరికీ తెలియకుండా స్నేహితుల నుంచి డబ్బులు అప్పు తీసుకొని, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్న. అక్కడ సీటు వచ్చిన వెంటనే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా. పారిపోయి వచ్చేశా. సాధారణంగా ఇంటి నుంచి వచ్చే వారు ఎలాంటి ప్లాన్ లేకుండా బయటకు వచ్చేసి తర్వాత ఏం చేద్దాం? అని ఆలోచిస్తారు. నేను మాత్రం అలా కాదు. ముందే అన్నీ ప్లాన్ చేసుకొని వచ్చేశా. ఇక ఇప్పుడు అదే కుటుంబం నా విషయంలో ఎంతో గర్వంగా ఉంది’ అని విజయ్ వర్మ తెలిపారు.
