NTV Telugu Site icon

Vijay Sethupathi: తెలుగులోకి విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?

Untitled Design (91)

Untitled Design (91)

విజయ్ సేతుపతి హీరోగా 2019లో త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం, సహనిర్మాతగా వ్యవహరించిన చిత్రం సూపర్ డీలక్స్. మిస్టీరియస్ థ్రిల్లర్స్ దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే రాశారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ , సమంతా రూత్ ప్రభు మరియు రమ్య కృష్ణన్ నటించారు . హైపర్‌లింక్ చిత్రంగా ,ఇది చాలా ఊహించని ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తుల యొక్క నాలుగు సమూహాల చుట్టూ కథాంశంతో వచ్చిన సూపర్ డీలక్స్ సూపర్ హిట్ సాధించింది.

Also Read: Bigboss: బిగ్ బాస్ 8కు హోస్ట్ గా కుర్ర హీరో.. ఈ సారి వేరే లెవల్..?

అప్పట్లో తమిళ బాక్సాఫీస్ వద్ద ఘాన విజయం సాధించిన ఈ సినిమాను దాదాపు 4 ఏళ్ల తర్వాత తెలుగులోకి తీసుకు రానున్నారు పూల మధు. దైవసెల్వితీర్థం ఫిలిమ్స్ బ్యానర్ పై దైవసిగమణి, తీర్థమలై, పూల మధు నిర్మాతలుగా సూపర్ డీలక్స్ ఆగస్టు 9న తెలుగు లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 400 పైగా థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు తెలుగు నిర్మాతలు.

Also Read: Wayanad: రాజంటే ప్రభాసే.. కేరళకు కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన ‘కర్ణ’..

తమిళంలో విజయం సాధించిన సినిమా సూపర్ డీలక్స్. విజయ్ సేతుపతి ఈ సినిమాలో స్పెషల్ లేడీ క్యారెక్టర్ రోల్ లో నటించారు. అదేవిధంగా ఆ క్యారెక్టర్ గాను ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. ఫహద్ ఫాసిల్, సమంత, రమ్యకృష్ణ పాత్రలు ప్రత్యేక ఆకర్షణ. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించగా పి. ఎస్. వినోద్, నీరవ్ షా డిఓపి గా పని చేశారు. నాలుగు విభిన్న కథలను జోడించి చిత్రీకరించిన ఈ చిత్రం ఎన్నో అవార్డులను క్రిటిక్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. మరి తెలుగు ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.

Show comments