Site icon NTV Telugu

Vijay Sethupathi Birthday: పండగ కబురు.. ‘పూరి-సేతుపతి’ ఫస్ట్ లుక్, టైటిల్‌కు ముహూర్తం ఫిక్స్!

Puri Sethupathi

Puri Sethupathi

‘మక్కల్‌సెల్వన్‌’ విజయ్ సేతుపతి అభిమానులకు సంక్రాంతి పండగ కబురు. దర్శకుడు పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం నుంచి కీలక అప్డేట్ వచ్చింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పూరి-సేతుపతి’ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను విజయ్ పుట్టినరోజు సందర్భంగ జనవరి 16 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ అనౌన్స్‌మెంట్ రావడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.

మాస్ ఎంటర్‌టైనర్‌లకు పెట్టింది పేరైన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబినేషన్ తొలిసారి రాబోతుండటంతో సినీ వర్గాల్లోనూ ఆసక్తి పెరిగింది. ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్‌, చార్మీ కౌర్‌, జేబీఎన్ నారాయణరావు కొండ్రొల్లా నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పణలో పూరి కనెక్ట్స్‌, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతోంది. టెక్నికల్‌గా కూడా ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో ఉండనుందని సమాచారం.

Also Read: Krithi Shetty: కృతి శెట్టి.. ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?

ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు సంయుక్త మీనన్‌, టబు, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్, విష్ణు రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మల్టీ స్టారర్ కాస్టింగ్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. విశేషం ఏమిటంటే.. ఈ సినిమాను తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న ఈ సినిమా నుంచి రాబోయే ఫస్ట్ లుక్, టైటిల్‌పై అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version