Site icon NTV Telugu

Vijay Sethupathi: విజయ్‌తో జీవితంలో మళ్లీ కలిసి పని చేయకూడదు అనుకున్న .. దర్శకుడు పాండిరాజ్

Vijay Sethupathi Pandiraj

Vijay Sethupathi Pandiraj

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా, నిత్య మీనన్ హీరోయిన్ గా కలిసి నటిస్తున్న చిత్రం ‘తలైవన్ తలైవి’. దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది. అయితే తాజాగా ఈ ‘తలైవన్ తలైవి’ సినిమా ఈవెంట్ లో భాగంగా దర్శకుడు పాండిరాజ్ మాట్లాడిన మాటలు ప్రజంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : Chiranjeevi : రవి తేజ తండ్రి మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం..

గతంలో, దర్శకుడు పాండిరాజ్, నటుడు విజయ్ సేతుపతి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తాయి. దీంతో ఆ విభేదాల కారణంగా.. ‘జీవితంలో మళ్లీ ఇంకెప్పుడూ కలిసి పనిచేయకూడదని తామిద్దరం నిర్ణయించుకున్నాం. అయితే, ఈ నిర్ణయం ఊహించని విధంగా మారిపోయింది. ప్రముఖ దర్శకుడు మిష్కిన్ పుట్టినరోజు పార్టీలో తామిద్దరం మళ్లీ కలుసుకున్నాం. ఈ సందర్భంగా, విజయ్ సేతుపతి స్వయంగా కలిసి, ‘మనం కలిసి ఒక సినిమా చేద్దాం’ అని వెల్లడించారు. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య నెలకొన్న దూరం తొలగిపోయి, కొత్త ప్రయాణానికి బీజం పడింది. అలా కలిసిన తర్వాత ‘తలైవన్ తలైవి’ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఈ కథానాయకుడి పాత్రకు విజయ్ సేతుపతి సరైన ఎంపిక అని భావించి. కథ పూర్తయిన తర్వాత సేతుపతికి కేవలం 20 నిమిషాల పాటు కథను వివరించాను. కథను విన్న వెంటనే, సేతుపతి ఏ మాత్రం ఆలోచించకుండా అంగీకరించా’ అని వివరించారు పాండిరాజ్.

Exit mobile version