Site icon NTV Telugu

Vijay Kanakamedala : అందుకే నాగ చైతన్యతో సినిమా ఆగిపోయింది..

Vijay Kanakamedala, Naga Chaithanya

Vijay Kanakamedala, Naga Chaithanya

మంచు మనోజ్‌, నారా రోహిత్‌ , బెల్లం కొండ శ్రీనివాస్‌ కలిసి నటించిన మల్టిస్టారర్ మూవీ ‘భైరవం’. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ నెల 30న విడుదల కాబోతున్న ఈ మూవీ షూటింగ్ తుది దశలో ఉంది.ఇందులో భాగంగా టీమ్‌ కూడా బాగానే ప్రమోట్‌ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా, ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిల్లై కథానాయికలుగా కనిపించనున్నారు. సంగీతం శ్రీచరణ్ పాకాల అందించగా, ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న దర్శకుడు విజయ్‌ కనకమేడల ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.

Also Read : #RAPO 22 : రామ్ పోతినేని 22 టైటిల్ గ్లింప్స్‌కి టైం ఫిక్స్..!

నాగచైతన్య, దర్శకుడు విజయ్‌ కనకమేడల కాంబోలో మూవీ తెరకెక్కబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ అది పట్టాలెక్కలేదు. అయితే తాజాగా ‘భైరవం’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు విజయ్‌ కనకమేడల.. ‘నాగచైతన్య మూవీ ప్లాన్ చేశాను. కథ కూడా ఫినిష్ అయ్యింది, చై కి స్టోరీ కూడా వినిపించాము కానీ ఆయనకు క్లైమాక్స్ నచ్చలేదు. అందుకే ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. అయినప్పటికి చైతన్య తో నాకు మంచి అనుబంధం ఉంది. ఎప్పటికైనా కచ్చితంగా అతనితో మంచి సినిమా తీస్తా.’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version