రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్డమ్’ సినిమా గురించి ఇప్పటికే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవబోతోందని అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ ..
Also Read : Renu Desai : రేణు దేశాయ్‌కు అనారోగ్యం – సర్జరీ అనంతరం వైరల్ పోస్ట్!
‘కింగ్డమ్’ మూవీ టికెట్ బుకింగ్స్ అమెరికాలో ఈరోజు (జూలై 17) నుంచే ప్రారంభమవుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అమెరికాలో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడి ప్రేక్షకుల్లో ముందస్తు టికెట్లపై మంచి హైప్ నెలకొంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఓ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. మాస్ క్లాస్ ప్రేక్షకుల్ని ఒకేసారి ఆకట్టుకునేలా కథ, విజువల్స్, సంగీతం రూపొందించబడుతున్నాయి. అనిరుధ్ సంగీతం ఇప్పటికే అంచనాలను పెంచింది. విజయ్ దేవరకొండ అభిమానులకు ఇది నిజంగా ఫెస్టివల్ వాతావరణం. ఇక టికెట్ బుకింగ్స్, సినిమా యూనిట్ నుంచి వస్తున్న పాజిటివ్ అప్డేట్స్, అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న రెస్పాన్స్ .. ‘కింగ్డమ్’ మూవీకి భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి.