Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!

Vijay Deverakonda

Vijay Deverakonda

Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి తమిళనాడు సీఎం, దళపతి విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. అటు సినీ రంగంలో, ఇటు రాజకీయాల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న విజయ్‌ను ఈ హిట్ పెయిర్ కలవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి వీరిపై పడింది. ఈ స్పెషల్ మీటింగ్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సీఎం విజయ్‌తో గడిపిన క్షణాల గురించి రౌడీ హీరో రాసుకొస్తూ.. “ప్రియమైన దళపతి విజయ్ సర్‌తో గడిపిన సమయం ఎంతో ప్రత్యేకమైనది. డే మొత్తం బిజీగా ఉన్నప్పటికీ ఆయన మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. లైఫ్, వర్క్, ప్రపంచం గురించి ఎన్నో పర్సనల్ విషయాలను, విలువైన అనుభవాలను మాతో పంచుకున్నారు. ఒక్క మీటింగ్‌తోనే ఆయన నాకు మోస్ట్ ఫేవరెట్ అయిపోయారు” అంటూ రాసుకొచ్చారు. విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి దళపతిని కలవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ, రష్మికల జోడీ పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘రణబాలి’ అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతోంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.