Site icon NTV Telugu

Viajay & Manchu : విజయ్ దేవరకొండ పై.. మనోజ్ కౌంటర్

Manchu Mannoj

Manchu Mannoj

ఇటీవల విజయ్ దేవరకొండ చేసిన నెపోటిజం వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీశాయి. ‘నెపో కిడ్స్‌కి ఇండస్ట్రీలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. కానీ, బ్యాగ్‌గ్రౌండ్ లేకుండా వచ్చినవాళ్లకు అలాంటి స్వేచ్ఛ ఉండదు’ అంటూ విజయ్ చెప్పిన మాటలు, సోషల్ మీడియాలో గట్టిగా ట్రెండ్ అయ్యాయి. అయితే తాజాగా మంచు మనోజ్ ఈ విషయంపై మెల్లిగా కౌంటర్ వదిలారు. ఇటివల..‘ఓ భామ అయ్యో రామ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గెస్ట్‌గా పాల్గొన్న మంచు మనోజ్, సుహాస్ ప్రయాణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ..

Also Read : Ramayana Update: ట్రోల్స్ బలైనా కాజల్.. మండోదరి పాత్ర నుంచి ఔట్ !

‘ సుహాస్‌ను చాలామందికి ఆదర్శంగా తీసుకోవాలి. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తీసి కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరోగా మారాడు. ఎంతో కష్టపడి ఇంత మంచి స్థాయికి వచ్చారు. ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్ళకి నెపో కిడ్స్‌కే అవకాశాలు దక్కుతాయి అనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ అపవాదిని పక్కన పెట్టాలి. ఎందుకంటే నెపో కిడ్స్ కి ఇండస్ట్రీలోకి ఎంట్రీ సులభమే.. కానీ నిలదొక్కుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది . నెపోటిజం ఇక్కడ పనికిరాదు. బ్యాగ్రౌండ్ ఉండి నెపో‌కిడ్ అయినంత మాత్రాన సక్సెస్ రాదు. సినిమాల కోసం కష్టపడి మనం పడ్డ కష్టాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే ఇండస్ట్రీలో మనం నిలదోక్కుకోగలుగుతాం. నెపోకిడ్ అయినంత మాత్రాన పప్పులు ఉడకవు..’ అంటూ కౌంటర్ ఇచ్చారు. అలాగే ‘సుహాస్ విజయ్ సేతుపతి లాగా ఓవైపు హీరోగా మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా ఎంతో బాగా రాణిస్తున్నారు’ అంటూ మంచు మనోజ్ సుహాస్ ఆకాశానికి ఎత్తారు.

Exit mobile version