NTV Telugu Site icon

Dil Raju : విజయ్ దేవరకొండ ‘ రౌడీ జనార్ధన్’

Viaj Dil Raju

Viaj Dil Raju

విజయ్ దేవరకొండ హీరోగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలు మిగిల్చింది. ఆ నష్టాలు తీర్చేందుకు దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. గతేడాది మే నెలలో దిల్ రాజు నిర్మాణంలో సినిమాను ప్రకటించాడు విజయ్ దేవరకొండ.కానీ అప్పటినుండి అలా సాగుతూఉంది ఈ సినిమా.

Also Read : Dil Raju : పైరసి పై దిల్ రాజు కిలక కామెంట్స్..

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా ‘రాజావారు రాణి వారు’ అనే సినిమాను డైరెక్ట్ చేసిన ర‌వికిర‌ణ్ కోలా దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. అయితే ఈ సినిమా గురించి దిల్ రాజు స్పందిచారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీరిలీజ్ ప్రెస్ మీట్ లో భాగంగా దిల్ రాజ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ సినిమా టైటిల్ ను రివీల్ చేసారు. రవి కిరణ్ దర్శకత్వంలో విజయ్ తో ‘రౌడీ జ‌నార్ధన్’ అనే సినిమా చేస్తున్నాం అని చెప్పారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా రానుంది. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్ ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. కాగా ఈ సినిమాను తెలుగు, కన్నడ, హిందీ, త