AVD తర్వాత మరో మల్టీప్లెక్స్.. నార్త్ హైదరాబాద్‌పై రౌడీ హీరో కన్ను!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు బిజినెస్ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఏషియన్ గ్రూప్ భాగస్వామ్యంతో మహబూబ్‌నగర్‌లో ఇప్పటికే AVD Cinemas పేరుతో మల్టీప్లెక్స్‌ను నిర్వహిస్తున్న విజయ్.. తాజాగా మరో మల్టీప్లెక్స్ ఏర్పాటుపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఉత్తర హైదరాబాద్‌లోని మధ్యతరగతి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మేడ్చల్ లేదా మల్కాజ్గిరి ప్రాంతాల్లో కొత్త మల్టీప్లెక్స్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. స్థలం, ఇన్వెస్ట్మెంట్, నిర్మాణం వంటి అంశాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ ప్లాన్ కార్యరూపం దాల్చితే ఉత్తర హైదరాబాద్‌లోని ప్రేక్షకులకు మరిన్ని ఆధునిక థియేటర్ ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల్లో ‘రణబాలి’పై భారీ హైప్ నెలకొంది. పెళ్లి తర్వాత కలిసి విజయ్–రష్మిక నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో ఈ మూవీపై మరింత ఆసక్తి నెలకొంది. తాజాగా ‘రణబాలి’ టీజర్‌కు సంబంధించి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా మాస్ యాక్షన్ టీజర్‌ను సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘‘ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ రైజెస్’’ అంటూ టీజర్‌పై మరింత క్యూరియాసిటీ పెంచారు. ‘రణబాలి’ చిత్రాన్ని అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!