Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?

Vijay Deverakonda Ranabaali

Vijay Deverakonda Ranabaali

Can Vijay Deverakonda Comeback With Ranabaali: టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో ‘విజయ్ దేవరకొండ’కు గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. 2018లో వచ్చిన ‘గీత గోవిందం’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విజయ్.. ఆ తర్వాత వరుసగా ఫ్లాప్‌లను ఎదుర్కొన్నాడు. గీత గోవిందం తర్వాత విజయ్ టాలీవుడ్‌లో టాప్‌లోకి దూసుకెళ్తాడని చాలామంది భావించారు. అయితే ఆ స్థాయిలో విజయాల పరంపరను కొనసాగించడంలో విఫలమై.. రేసులో వెనకపడిపోయాడు. ‘డియర్ కామ్రేడ్’ పర్వాలేదనిపించినా.. ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. భారీ అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ‘లైగర్’ సైతం విజయ్ కెరీర్‌కు ఊహించని షాక్ ఇచ్చింది.

‘ఖుషి’, ‘ఫ్యామిలీ స్టార్’, ‘కింగ్‌డమ్’ చిత్రాలు కూడా విజయ్‌ దేవరకొండకు ఆశించిన కమ్‌బ్యాక్‌ను ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం విజయ్ ఆశలన్నీ తన తదుపరి చిత్రం ‘రణబాలి’పైనే ఉన్నాయి. ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు సమయం దగ్గరపడుతున్నప్పటికీ.. సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్ కనిపించడం లేదు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను, ఆసక్తిని క్రియేట్ చేయలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. విజయ్‌కు ఉన్న స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా సినిమాపై హైప్ రావాల్సి ఉన్నప్పటికీ.. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.

రణబాలి విడుదలకు ముందు చిత్రబృందం చేతిలో ఉన్న చివరి ప్రధాన ఆయుధం ట్రైలర్‌. ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపని ప్రమోషనల్ కంటెంట్‌కు భిన్నంగా ట్రైలర్ అదిరిపోయేలా ఉంటే.. సినిమాపై ఒక్కసారిగా బజ్ పెరిగే అవకాశం ఉంది. ట్రైలర్‌ బాగుంటే రణబాలిపై అంచనాలు పెరుగుతాయి. రష్మిక కూడా సినిమాకు అదనపు బలం కానునున్నారు. ఇక అంతా ట్రైలర్‌ పైనే ఆధారపడి ఉంది. విజయ్ కెరీర్‌లో గీత గోవిందం తర్వాత సరైన బ్లాక్‌బస్టర్ కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. వరుస పరాజయాల తర్వాత రణబాలితో విజయ్ మళ్లీ తన సత్తా చాటుతాడా?.. ఆయన కెరీర్‌ మళ్లీ ఉపందుకుంటుందా? అనేది రణబాలి ఫలితమే నిర్ణయిస్తుంది.