టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ లాస్ వెగాస్ లో ప్రస్తుతం ‘లైగర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే… మధ్య మధ్యలో ఆటవిడుపు అన్నట్టుగా హార్స్ రైడింగ్ చేస్తున్నాడు. మొన్నటి వరకూ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ ఇప్పుడు అందుకు భిన్నంగా హార్స్ రైడింగ్ చేస్తున్న కలర్ ఫుల్ ఫోటోను పోస్ట్ చేశాడు.
హార్స్ రైడింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన విజయ్ దేవరకొండ త్వరలో తనకంటూ ఓ సొంత గుర్రాన్ని కూడా కొనబోతున్నట్టు తెలిపాడు. విశేషం ఏమంటే… టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం గుర్రపు స్వారీని ఇష్టపడటమే కాకుండా, సొంతంగా ఇప్పటికే రెండు గుర్రాలను పెంచుకుంటున్నాడు. అందులో ఒకదాని పేరు బాద్షా కాగా మరోదాని పేరు కాజల్. మరి విజయ్ దేవరకొండ తాను పెంచుకునే గుర్రానికి ఏం పేరు పెడతాడో చూడాలి.
