Site icon NTV Telugu

“కామ్రేడ్”ను గుర్తు చేసుకున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda remembers Dear Comrade Movie

విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీమూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ కలసి భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డియర్ కామ్రేడ్’. జూలై 26, 2019లో ఈ సినిమా విడుదలైంది. రశ్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఈ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్విటర్ లో ఈ సినిమాను గుర్తు చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన ఈ సినిమా మ్యూజిక్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కావటం విశేషం.

Read Also : ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’ ఫస్ట్ లుక్ లాంచ్

https://twitter.com/TheDeverakonda/status/1419575820788535297
Exit mobile version