Liger Emoji : లైగర్‌ మెనియా.. ట్విట్టర్‌ స్పెషల్‌ ఎమోజీ

Liger Emoji Twitter

Liger Emoji Twitter

Vijay Devarakonda liger Emoji on twitter

హీరో విజయ్‌ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కెరీర్ ఆరంభంలోనే పెళ్లిచూపులు సినిమాతో లైమ్‌ లైట్లోకి వచ్చిన విజయ్‌.. అర్జున్ రెడ్డి సినిమాతో ట్రెండ్ క్రియేట్ చేశారు. అయితే.. అప్పటిదాకా వెళుతున్న సినీ ట్రాక్ మార్చేస్తూ అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నారు విజయ్‌. హీరో అంటే ఇలా కూడా ఉంటాడా? అనే టాక్‌తో ఫుల్ పాపులర్ అయ్యారు. అయితే.. ప్రస్తుం.. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన లైగ‌ర్ సినిమా ఆగ‌స్ట్ 25న రిలీజ్ కానుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ బిజీగా ఉన్నాడు. దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ప‌ర్య‌టిస్తున్నాడు. లైగర్ సినిమాతో అనన్యా పాండే సౌత్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నంది. విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది.

బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే.. ఈ ఊరు ఆఊరు అని కాకుండా.. ఫ్యాన్‌ టూర్‌ పేరుతో అన్ని ఏరియాను కవర్‌ చేస్తున్నాడు రౌడీ బాయ్‌. అయితే.. ట్విట్టర్‌లో కూడా లైగర్‌ మెనియా కనిపిస్తోంది. ఇప్పటికే లైగర్‌ సినిమాకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటే.. మరో రెండు రోజుల్లో లైగర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నారు. అయితే.. ఈ క్రమంలో.. ట్విట్టర్‌ లైగర్‌ పేరు మీద ఒక ఎమోజీ దర్శనిమిస్తోంది. ఇప్పటివరకు ఏ సినిమాను ఇలాంటి ఎమోజీ ట్విట్టర్‌ కనిపించలేదు. అయితే.. రౌడీ బాయ్‌ క్రేజ్‌తో ట్విట్టర్‌ ఇప్పుడు ఈ ఎమోజీ ట్రెండింగ్‌లో ఉంది.