హీరో విజయ్ దేవరకొండ ఆకర్షణీయమైన ఫొటోతో ప్రముఖ సినీ పత్రిక ఫిలింఫేర్ తన మే నెల సంచిక కవర్ పేజీని విడుదల చేసింది. “విక్టరీ జర్నీ” అనే శీర్షికతో, విజయ్ దేవరకొండ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయి స్టార్‌గా ఎదిగిన ప్రస్థానాన్ని ఈ సంచిక విశ్లేషిస్తూ, సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.
Also Read: Manchu Vishnu : ప్రభాస్ కు ఎప్పటికీ రుణపడి ఉంటా.. మంచు విష్ణు కామెంట్స్..
విజయ్ దేవరకొండ తన రాబోయే చిత్రం “కింగ్డమ్”తో పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిభావంతుడైన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. “కింగ్డమ్” జూలై 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
