తమిళ హీరో విజయ్ ఆంటోనీ “సలీం, పిచైక్కరన్, యమన్” వంటి విభిన్నమైన చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. విజయ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనలో నటుడు మాత్రమే కాకుండా సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నాడు. ఉత్తమ సంగీత విభాగంలో పాపులర్ సాంగ్ “నక్కా ముక్కా” అనే పాట కోసం కేన్స్ గోల్డెన్ లయన్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయుడు. ఇప్పుడు ఆయన “విజయ రాఘవన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయ రాఘవన్ తో ఆత్మిక జత కట్టబోతోంది.
Read Also : “సర్కారు వారి పాట” ఫస్ట్ నోటీసు వచ్చేసింది !
ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో ఈ మూవీ మాస్ యాక్షన్-ఎంటర్‌టైనర్‌గా ఉండబోతున్నందున “విజయ్ రాఘవన్” విడుదలపై సినీ ప్రేమికులు, ఈ హీరో అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతం నివాస్ కె. ప్రసన్న అందించగా, సినిమాటోగ్రఫీని ఎన్ఎస్ ఉదయ కుమార్ నిర్వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం స్టార్ హీరో రానా దగ్గుబాటి విజయ్ ఆంటోనీకి సపోర్ట్ ను ఇవ్వబోతున్నారు. రానా చేతుల మీదుగా సోమవారం సాయంత్రం 5:01 గంటలకు “విజయ రాఘవన్” ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో కొత్త పోస్టర్‌ను షేర్ చేసి “విజయ రాఘవన్” మేకర్స్ ధృవీకరించారు. టాలీవుడ్‌లో విజయ్ ఆంటోనీకి ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. అతను చివరిగా ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహించిన “కిల్లర్”లో కనిపించాడు.