Romeo : ఒకేసారి రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ కు రానున్న విజయ్ ఆంటోనీ “రోమియో”..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ ‘రోమియో’.. ఈ మూవీ ఏప్రిల్ 11 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. తెలుగు లో ఈమూవీ “లవ్ గురు” పేరుతో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్టర్ వినాయకన్ వైద్యనాథన్ తెరకెక్కించారు.ఈ మూవీని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించగా.. భరత్ ధనశేఖర్, రవి రోయ్‍స్టర్ సంగీతం అందించారు. నిత్యం యాక్షన్ చిత్రాలతో అలరించే విజయ్ ఆంటోనీ ఈ సారి రూటు మార్చి రొమాంటిక్ కామెడీ డ్రామా జానర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ..ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు..ఈ సినిమాలో మృనాలిని రవి హీరోయిన్ గా నటించింది.అలాగే వీటీవీ గణేశ్, యోగిబాబు, ఇళవరసు, తలైవాసల్ విజయ్ మరియు సుధ ముఖ్య పాత్రలలో కనిపించారు.
అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు చిత్ర యూనిట్ ప్రమోషన్లను గట్టిగానే చేసింది.అలాగే తెలుగు వెర్షన్ “లవ్ గురు” కోసం కూడా ప్రమోషన్లను జోరుగా చేశారు. సినిమా విడుదల అయ్యాక మాత్రం ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది.దీనితో ఈ మూవీకి అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాలేదు.ప్రస్తుతం ఈ మూవీ ఓటిటిలోకి వచ్చేందుకు సిద్ధం అయింది.రోమియో మూవీ ఒకేసారి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అయితే తెలుగు వెర్షన్ మూవీ “లవ్ గురు” స్ట్రీమింగ్ పై మాత్రం క్లారిటీ లేదు.రోమియో మూవీ మొదట ఆహా ఓటీటీలో శుక్రవారం (మే 10) నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలిసింది. అయితే తాజాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు.ఈ రెండు ఓటీటీల్లో మే 10వ తేదీ నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.
Also Read
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
తాజావార్తలు
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!