NTV Telugu Site icon

Amardeep Chowdary: సైలెంటుగా మరో సినిమా మొదలెట్టిన అమర్ దీప్ చౌదరి

Amardeep Chow

Amardeep Chow

‘అలా నిన్ను చేరి’, ‘సన్నీ లియోన్ మందిర’ వంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విజన్ మూవీ మేకర్స్, తమ మూడో చిత్రంగా ‘సుమతీ శతకం’ను తీసుకొస్తోంది. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో, కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌తో ఎం. ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి, సైలీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం, యువతను ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఉగాది పర్వదినాన ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. బండారు నాయుడు కథ అందించిన ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం సమకూరుస్తున్నారు. హలేష్ సినిమాటోగ్రఫీని, సురేష్ విన్నకోట ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా విజన్ మూవీ మేకర్స్ ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లనుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేసింది.