ఇండస్ట్రీ ఏదైనప్పటికి సీనియర్ స్టార్ హీరోలు యంగ్ హీరోయిన్స్‌తో కలిసి నటిస్తారని తెలిసిందే. కానీ సినిమాని సినిమాలా చూడకుండా కొంతమంది మాత్రం హీరో – హీరోయిన్స్ మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది అంటూ కామెంట్స్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి విమర్శలు మన సీనియర్ హీరోలకు చాలా ఎదురుకున్నారు. తాజాగా రష్మిక ఇంకా సల్మాన్ ఖాన్ మీద కూడా ఇదే విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరు జంటగా ‘సికందర్’ మూవీలో నటించారు. ఇక సల్మాన్ ఖాన్‌కి రష్మిక మధ్య 31 ఏళ్ళ గ్యాప్ ఉంది. వీళ్ళు ఎలా హీరో హీరోయిన్స్‌గా నటిస్తారు అంటూ పలువురు వీరిపై ట్రోల్స్ చేసారు.
Also Read : Kushboo : నటించేంత టాలెంట్, అందం నా దగ్గర లేదు.. ఖుష్బూ కూతురు
కానీ తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సల్మాన్ ఖాన్ ట్రోల్ చేసేవారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.. ‘నాకు, హీరోయిన్ కి 31 ఏళ్ళ గ్యాప్ ఉందని కొంతమంది అంటున్నారు. నాతో నటించే హీరోయిన్‌కి ,హీరోయిన్ ఫాదర్‌కి లేని ప్రాబ్లమ్ మరి మీకెందుకు. ఒకవేళ ఆమెకు పెళ్లయి ఆమెకు కూతురు ఉంటే, ఆమెతో కూడా పనిచేస్తాను ఆమె తల్లి ఒప్పుకుంటే’ అని ట్రోలర్స్‌కి కౌంటర్ ఇచ్చాడు. దీంతో సల్మాన్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అయితే రీసెంట్‌గా సల్మాన్ మాటలపై పలువురు బాలీవుడ్ నటీనటులు స్పందించారు అందులో విద్యా బాలన్ కూడా ఒక్కరు.. ఆమె
‘హీరోయిన్స్‌కి 40 ఏళ్లు పడంగానే అమ్మమ్మ నాయినమ్మ పాత్రలు చేయాలా.. హీరోలు మాత్రం హీరోలాగే ఉంటారా. హీరోలు వారి వయస్సుకి తగిన పాత్రలు వేయారు.. మేం మాత్రం మా వయసుకి తగిన పాత్ర చేయాలి. నాకు హృతిక్ పక్కన నటించాలి అని ఉంది. ఇప్పుడు అది కుదరదు ఎందుకంటే ఇక్కడ ఏజ్ చూస్తారు. పాత హీరోయిన్ అనే ముద్ర వేస్తారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.