NTV Telugu Site icon

Exclusive : 20 కథలు విని రిజెక్ట్ చేసిన విక్టరీ వెంకటేష్

Venky

Venky

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు విక్టరీ వెంకటెష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా  థియేటర్స్ లో 50 రోజుల రన్ కూడా పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ మెన్ గా వెంకీ పండించిన హాస్యానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చిన సక్సెస్ తో తర్వాత రాబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు వెంకీ.

Also Read : Kedar Selagamsetty : దుబాయిలో నిర్మాత కేదార్ అంత్యక్రియలు పూర్తి

ఈ సారి చేసే సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని భావిస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ తర్వాత దాదాపుగా  20 కథలు విన్నారు. కానీ ఒక్కటి కూడా ఓకే చేయలేదు వెంకీ. ఏ మాత్రం కొద్దిగా బాలేదు అని అనిపించిన ఎంత పెద్ద డైరెక్టర్ అయిన సరే రిజెక్ట్ చేసేస్తున్నాడు. గతంలో F2, F 3 సక్సెస్ తర్వాత శైలేష్ కొలను డైరెక్షన్ లో ‘సైంధవ్’ అనే యాక్షన్ సినిమా చేసాడు. కానీ ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని రాబట్టింది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ ను కంటిన్యూ చేసేందుకు ఆచి తూచి అడుగులు వేయాలని డిసైడ్ అయ్యాడు దగ్గుబాటి హీరో. కానీ ఇక్కడ మరోక విషయం ఏంటంటే వెంకీ కొత్తగా ట్రై చేసిన ప్రతిసారి రిజల్ట్ ఆశించినంత రాలేదు. ప్రేక్షకులు కూడా వెంకీ అంటే ఫ్యామిలీ సినిమా సరదాగా నవ్వుకునే సినిమా అనే ఫిక్స్ అయి ఉన్నారు. మరి ఇప్పుడు రిజెక్ట్ చేసిన 20 కథలలో కొత్తదనం ఉందని రిజెక్ట్ చేశాడా లేదా రెగ్యులర్ స్టోరీస్ అని రిజెక్ట్ చేశాడా అనేది క్లారిటీ లేదు. ఏదేమైనా రూ. 303 కోట్ల రీజినల్ బ్లాక్ బస్టర్ తర్వాత చేసే సినిమా అంటే ఆ మాత్రం జాగ్రత్తలు, వడపోతలు ఉండాలి. లేదంటే మళ్ళి ప్లాప్ పడిందంటే మార్కెట్ లెక్కలు, క్రేజ్ మారిపోతాయి. అలాగే ఇక నుండి దగ్గుబాటి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే సినిమాలే చేయాలని డిసైడ్ చేసుకుని కుడికలు, తీసివేతలు చేస్తున్నాడు విక్టరీ. మరి ఈ దగ్గుబాటి హీరో నెక్ట్స్ సినిమా ఎవరితో లాక్ అవుతుందనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.