NTV Telugu Site icon

Vicky Kaushal: కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన విక్కీ కౌశల్.. ఏమన్నారంటే..?

Vicky Kaushal

Vicky Kaushal

గతంలో కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ అంటూ పూకార్లు వచ్చాయి. అప్పుడు నటి గర్భవతి కాదని తేలింది. అయితే ఇప్పుడు మళ్లీ కత్రినా ప్రెగ్నెన్సీ చర్చనీయాంశమైంది. తొలిసారిగా కత్రినా ప్రెగ్నెన్సీపై వస్తున్న పుకార్లపై భర్త, నటుడు విక్కీ కౌశల్ స్పందించాడు. తన రాబోయే చిత్రం ‘బాడ్ న్యూస్’ ప్రమోషన్‌లో భాగంగా విక్కీ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఇటీవల విడుదల చేసి పాట కూడా హిట్ అయ్యింది. అయితే ఓ పాట విషయంలో ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్స్ తో పాటు కత్రినా గర్భవతి అనే వార్త వైరలవుతుండటంతో విక్కి మౌనం వీడాడు.

READ MORE: Kolkata Video: రైల్వే క్రాసింగ్ గేట్‌లోపలికి వచ్చేసిన కారు.. వేగంగా ఢీకొట్టిన రైలు

ఓ ఇంటర్వ్యూ లో విక్కి తన భార్య కత్రినా కైఫ్ గురించి ప్రస్తావించారు. ఆమె రాకతో జీవితం ఆనందంగా మారిందన్నారు. కత్రిన ప్రెగ్నెంట్‌ అంటూ జరుగుతోన్న ప్రచారంపై మాట్లాడుతూ.. ‘‘గుడ్‌న్యూస్‌ ఏదైనా ఉంటే సంతోషంగా ఆ విషయాన్ని మీతో పంచుకుంటాం. నెట్టింట వైరల్‌గా మారిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతానికి ‘బ్యాడ్‌న్యూస్‌’(సినిమా) ఎంజాయ్‌ చేయండి.” అని వ్యాఖ్యానించారు. ‘బ్యాడ్‌న్యూస్‌’ లోని రీసెంట్‌ హిట్‌ సాంగ్‌ ‘తౌబా తౌబా’ గురించి మాట్లాడారు. ఆ పాట కోసం టీమ్‌ అంతా కష్టపడి వర్క్‌ చేసినట్లు తెలిపాడు. సుమారు నాలుగు రోజులపాటు ఆ డ్యాన్స్‌ నేర్చుకున్నానని చెప్పారు. స్టెప్పులు నేర్పించి, ఎంతోగానో శ్రమించిన టీమ్‌కు ధన్యవాదాల తెలిపారు. ప్రేక్షకులు నా శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందించారని.. ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటానన్నారు. కాగా..ఈ సినిమా జులై 19న విడుదల కానుంది.

Show comments