NTV Telugu Site icon

Vettaiyan : వేట్టయాన్ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్ .. రిలీజ్ వాయిదా పడే అవకాశం.?

Untitled Design (20)

Untitled Design (20)

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం వేట్టయాన్. జై భీమ్ వంటి సినిమాను తెరకెక్కించిన టీజే జ్ఞానవేల్ వేట్టయాన్ కు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదేరోజు తమిళ స్టార్ సూర్య నటించిన కంగువ రిలీజ్ కానుంది. ఈ సినెమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా అత్యంత భారీ బడ్జెట్ లోనిర్మిస్తున్నారు. దీంతో తమిళ నాడు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ క్లాష్ ఏర్పడింది.

Also Read: Subrahmanyaa : తండ్రి దర్శకత్వంలో కొడుకు హీరోగా వెండితెరకు పరిచయం..

తాజాగా  ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను అధికారకంగా ప్రకటించారు మేకర్స్. వినాయక చవితిని పురస్కరించుకుని ఈ చిత్రంలోనీ ‘అర్థమైందా’ అని సాగే మొదటి పాటను సెప్టెంబరు 9న రిలీజ్ చేయబోతున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు. ఆ పోస్టర్ లో అక్టోబరు 10న రిలీజ్ అని మరోసారి ప్రకటించారు నిర్మాతలు. వెట్టయన్ అక్టోబరు 10న థియేటర్లలోకి రాకపోవచ్చని టాక్ నడించింది. ఆ ఊహాగానాలు తెరదించుతూ చెప్పిన తేదికి కచ్చితంగా రిలీజ్ చేస్తామని మరోసారి తెలిపింది యూనిట్.  ఈ నేపథ్యంలో కంగువ పోస్ట్ పోన్ అయ్యే అవకాశలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు మేకర్స్. సోలో రిలీజ్ కోసం ఎదురు చూస్తుంది ఈసినిమా.  మరోవైపు తలైవా రజనీకి పోటీగా యంగ్ హీరో జీవా నటించిన బ్లాక్ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, రావు రమేష్  నటించిన వేట్టయాన్ ను లైకా ప్రొడక్షన్స్  నిర్మించింది.

Show comments