Vettaiyan-The Hunter: ‘వేట్టయన్’ రజినీకాంత్ దిగాడు.. అంచనాలు రేపుతున్న ప్రివ్యూ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“Vettaiyan-The Hunter” prevue Telugu version: సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ద హంటర్’.టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ‘వేట్టయన్- ద హంటర్’ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ పేరుతో చిత్ర యూనిట్ వీడియోను విడుదల చేసింది. ఇంతకీ ఈ ప్రివ్యూ వీడియోలో ఏముందనే వివరాల్లోకి వెళితే.. పోలీస్ డిపార్ట్మెంట్లోని టాప్ మోస్ట్ సీనియర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌ల ఫొటోలు చూపిస్తూ.. ఈ ఆఫీసర్స్ ఎవరో మీకు తెలుసా! అని సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) అడుగుతారు. వీళ్లు పేరు మోసిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని ట్రైనింగ్‌లోని ఓ ఆఫీసర్ సమాధానం చెబుతారు. ‘ఈ దేశంలో లక్షలాది మంది పోలీసులున్నారు.. కానీ వీళ్లని మాత్రం చూడగానే గుర్తుపడుతున్నారంటే!.. అదెలా సాధ్యం’ అని మళ్లీ ప్రశ్నవేయగా.. ట్రైనింగ్ తీసుకుంటోన్న మరో లేడీ ఆఫీసర్ ‘మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్‌ని భయపడకుండా ఎన్కౌంటర్స్ చేయటం వల్ల వీళ్లు హీరోస్ అయ్యారు’ అని సమాధానం చెబుతుంది.
Actor Arrested: రేప్ కేసులో మరో నటుడు అరెస్ట్
Also Read
- Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
- Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
మధ్య మధ్యలో మన కథానాయకుడు వేట్టయన్ (రజినీకాంత్) తన డ్యూటీలో ఎంత పవర్‌ఫుల్‌గా వ్యవహరించారు. ఎన్కౌంటర్స్ ఎలా చేశారనే సన్నివేశాలను చూపిస్తూ వచ్చారు. ‘మనకు ఎస్.పి అనే పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు’ అని నేరస్థులు రజినీకాంత్ అంటే భయపడుతుంటారు. విలన్స్ వేట్టయన్ పేరు చెబితేనే హడలిపోతుంటారు. డీల్ చేయటానికి భయపడుతుంటారు. రౌడీయిజం పేరు చెప్పి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న వారిని వేట్టయన్ వేటాడుతుంటాడని ప్రివ్యూ సన్నివేశాల్లో చూపిస్తూ వచ్చారు. ఇక ఫహాద్ ఫాజిల్, దుసారా విజయన్, ప్రతినాయకుడిగా నటించిన రానా దగ్గుబాటి, అభిరామి, మంజు వారియర్ పాత్రలను పరిచయం చేశారు. అసలు వీళ్ల పాత్రలకు, వేట్టయన్కు ఉన్న సంబంధం ఏంటి? ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్‌గా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న వేట్టయన్ జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనే విషయాలు తెలుసుకోవాలంటే ‘వేట్టయన్- ద హంటర్’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
- Tags
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!