వివాదాస్పద సెలబ్రిటీ ఆస్ట్రాలజర్‌గా పేరు తెచ్చుకున్న వేణు స్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనకు తాను సెలబ్రిటీ ఆస్ట్రాలజర్‌గా చెప్పుకునే వేణు స్వామి దగ్గరకు హీరోయిన్లు కూడా వెళుతూ ఉంటారు. అప్పుడప్పుడు వారి ఫోటోలను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తన పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాడు. అయితే, తాజాగా ఆయనకు ఘోర పరాభవం ఎదురైంది. కామాఖ్య ఆలయ సిబ్బంది ఆయనను గుడిలోకి రానివ్వకుండా బయటకు గెంటి వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read:KTR : పదేళ్ల లో రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది
నిజానికి, అస్సాం రాజధాని డిస్పూర్ సమీపంలో ఉన్న గౌహతిలో శక్తి పీఠాలలో ఒకటైన కామాఖ్య అమ్మవారి ఆలయం ఉంది. అక్కడ తాంత్రిక పూజలు కూడా జరిపిస్తూ ఉంటానని గతంలో వేణు స్వామి పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. అయితే, లక్షలలో అక్కడ పూజలు ఉంటాయని సోషల్ మీడియాలో ఆయన విపరీతంగా ప్రచారం చేశారు. ఇదే విషయాన్ని ఓ టీవీ ఛానల్ కామాఖ్య ఆలయం దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో వారు వేణు స్వామి మీద చర్యలు తీసుకుంటామని గతంలోనే ప్రకటించారు. ఇక ఇప్పుడు, బహుశా దాని ఎఫెక్ట్ వల్లనే నేమో, ఆయనను బయటికి గెంటివేసి ఉంటారని అంటున్నారు. అయితే, ఈ విషయం మీద వేణు స్వామి ఇప్పటివరకు స్పందించలేదు.
