Anil Ravipudi : అనిల్ రావిపూడి సినిమా పేరుతో భారీ మోసం.. నిర్మాతల సంచలన ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ మరియు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ #VenkyAnil5 (#NKRAR2). సాహు గారపాటి నిర్మాణంలో, జీవీ ప్రకాశ్ సంగీతంలో షైన్ స్క్రీన్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ క్రేజ్ ఆసరాగా చేసుకుని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాలనుకునే అమాయక యువతీ యువకులను బురిడీ కొట్టించడానికి కొందరు కేటుగాళ్లు రంగంలోకి దిగారు. ఈ సినిమా పేరుతో సోషల్ మీడియాలో సాగుతున్న ఒక పెద్ద మోసంపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
సినిమాలో నటించే అవకాశం ఉందంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు నకిలీ కాస్టింగ్ కాల్స్ నడుపుతున్నట్లు చిత్ర బృందం గమనించింది. దీనిపై ప్రొడక్షన్ హౌస్ అత్యంత వేగంగా స్పందిస్తూ ఒక అధికారిక నోట్‌ను విడుదల చేసింది. “మా సినిమా పేరుతో ఒక నకిలీ కాస్టింగ్ కాల్ సోషల్ మీడియా మరియు ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఆ కాస్టింగ్ కాల్‌కు మా చిత్ర బృందానికి ఎలాంటి సంబంధం లేదు” అని నిర్మాతలు తేల్చి చెప్పారు. సినిమాల్లో ఛాన్స్ కోసం ఎదురుచూసే వారి బలహీనతలను పెట్టుబడిగా మార్చుకుని, మోసగాళ్లు డబ్బులు వసూలు చేసే ప్రమాదం ఉందని టీమ్ హెచ్చరించింది. మా సినిమా తరఫున కాస్టింగ్ పేరుతో సంప్రదిస్తున్న ఏ వ్యక్తికీ మీ వ్యక్తిగత వివరాలు, ఫోటోలు లేదా డాక్యుమెంట్స్ షేర్ చేయవద్దు. ఈ సినిమా ఆడిషన్స్ లేదా సెలెక్షన్ల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, చిత్ర యూనిట్ రూపాయి కూడా ఆశించదని స్పష్టం చేశారు.
Also Read
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Don't Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ఒకవేళ ఈ సినిమాకు సంబంధించి భవిష్యత్తులో ఏదైనా కాస్టింగ్ అవసరం ఉంటే, దానికి సంబంధించిన ప్రకటనలు కేవలం అధికారిక మరియు వెరిఫైడ్ సోషల్ మీడియా ఖాతాల ద్వారానే వస్తాయని మేకర్స్ స్పష్టం చేశారు. “జాగ్రత్తగా ఉండండి, మోసగాళ్ల బారిన పడవద్దు” అని చిత్ర బృందం సినిమా ఆస్పిరెంట్స్‌కు విజ్ఞప్తి చేస్తోంది. కాబట్టి సినీ అవకాశాల కోసం ప్రయత్నించే వారు ఇలాంటి ఫేక్ పోస్టుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండటం అవసరం.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!