Site icon NTV Telugu

Venkatesh: ఏకంగా 3 సినిమాలు లైన్లో పెట్టిన వెంకీ మామ?

Venkatesh

Venkatesh

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వచ్చి దాదాపు 6 నెలలు పూర్తవుతుంది. ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ నిలిచింది. ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా కూడా అద్భుతంగా ఉండాలని సాదాసీదా కథలను ఎంచుకోకుండా సాలిడ్ ప్రాజెక్టులను మాత్రమే ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు వెంకీ మామ. కొన్నాళ్లపాటు కథలు విన్న ఆయన తర్వాత వెకేషన్ కి బయటికి వెళ్ళాడు.

Also Read:Thammudu: దిల్ రాజు ముందు పెను సవాల్!

ఇప్పుడు మళ్లీ లైన్ లో కూర్చున్న ఆయన ఏకంగా మూడు సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి అనిల్ రావుపూడి మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న సినిమా. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా నెల రోజులు పాటు డేట్స్ ఇచ్చాడట. ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలైపోయింది.

Also Read:Kannappa : కన్నప్పకు అదే అతిపెద్ద సమస్య..?

ఆగస్టులో షూట్ మొదలయ్యే ఆకాశం ఉంది. సమ్మర్ 2026 కి రిలీజ్ చేసే పాన్లో ఉన్నారు. ఇది కాకుండా దృశ్యం 3 సినిమా కూడా ఆయన లైన్ లో పెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గతంలో అక్కడి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగులో రీమేక్ చేసేవారు. కానీ ఇప్పుడు మలయాళం, తెలుగుతో పాటు హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేయడానికి దృశ్యం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మోహన్లాల్, వెంకటేష్, అజయ్ దేవగన్ ముగ్గురు ఆయా భాషల్లో నటిస్తున్నారు. ఈ లెక్కన వెంకటేష్ మూడు సినిమాలు లైన్ లో పెట్టినట్టు అయింది.

Exit mobile version