Aadarsha Kutumbam: చిత్ర పరిశ్రమలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లిన తర్వాత స్క్రిప్ట్‌లో మార్పులు జరగడం కొత్తేమీ కాదు. కానీ, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇటీవల విడుదలై సూపర్ హిట్ కొట్టిన ఒక సినిమా కథకు, విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ (హౌస్ నెం.47) చిత్రానికి చాలా పోలీకలు ఉన్నాయట. ఈ రెండు సినిమాల కథలు ఒకేలా ఉన్నాయనే విషయం యూనిట్ దృష్టికి రావడంతో, మేకర్స్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.
ఆదర్శ కుటుంబం సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నప్పటికీ.. కథలో, కొన్ని కీలక సన్నివేశాలలో భారీ మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను వెండి తెరపై చూసేటప్పుడు ప్రేక్షకులకు ఇటీవల విడుదలైన ఆ హిట్ సినిమా ఛాయలు ఎక్కడా కనిపించకూడదనే ఉద్దేశంతో ఆదర్శ కుటుంబం టీం సెట్స్‌లోనే సీన్లను రీ-రైట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. కథనంలో సరికొత్త ట్విస్టులు జోడించి, ఇప్పటికే విడుదలై హిట్ కొట్టిన ఆ చిత్రానికి పూర్తి భిన్నంగా దీనిని ప్రెజెంట్ చేయడానికి చిత్ర యూనిట్ కసరత్తులు చేస్తోందట. మరి ఈ మార్పులు ఆ సినిమాకు ఎలాంటి ప్లస్ కానున్నాయో సినిమా వెండి తెరపైకి వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

