Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సుమారు 25 ఏళ్ల తర్వాత వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం (AK-47)’. అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెంకీ మామ ఫుల్ జోష్‌లో కనిపించారు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత త్రివిక్రమ్‌తో మళ్లీ ఎలాంటి సినిమా చేయాలనే ప్రెజర్ ఉండేదని, కానీ సూపర్ థ్రిల్, సస్పెన్స్, అద్భుతమైన ఎమోషన్స్‌తో త్రివిక్రమ్ తెచ్చిన ఈ స్క్రిప్ట్ తనను ఎంతో ఎక్సైట్ చేసిందని వెంకటేష్ తెలిపారు. “గతంలో నేను నటించిన ఫ్యామిలీ సినిమాల్లో అందరినీ ప్రేమించాను.. అంతా కలిసి ఉంటే బాగుంటుంది అనుకున్నాను. కానీ ‘ఆదర్శ కుటుంబం’లో అలా కాదు.. ఏదేమైనా నా ఫ్యామిలీని నేను కాపాడుకుంటాను, వాళ్ల కోసం ఎంతకైనా తెగిస్తాను!” అంటూ విక్టరీ వెంకటేష్ ఇచ్చిన మాస్ స్టేట్మెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పక్కా ఫ్యామిలీ హీరో నుంచి ఒక ఫెరోషియస్ ఫ్యామిలీ ప్రొటెక్టర్‌గా వెంకటేష్ మారిన తీరుపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
సినిమా సక్సెస్‌పై ఆయన ఎంతో కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతూ ఓ సంచలన పోలిక తెచ్చారు. “ఇటీవల మన ఇండియన్ క్రికెట్ టీమ్ కుర్రాళ్లు సంజూ శాంసన్, అభిషేక్, తిలక్ వర్మ స్టేడియంలో ఎలాగైతే సిక్సర్లు కొడుతున్నారో.. మా ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రేపు థియేటర్లలో, స్టేడియం బయట అలా సిక్సర్లు, సెంచరీలు కొట్టడం ఖాయం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే వేదికపై దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వెంకటేష్ కెరీర్లోనే ఇది ‘వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పెర్ఫార్మెన్స్’ అని కితాబివ్వడం విశేషం. రిజల్ట్ గురించి ఆలోచించకుండా కర్మయోగిలా పని చేసుకుపోయే వెంకటేష్ పాజిటివిటీ, ఆయన ఎనర్జీ సెట్లోని అందరికీ స్ఫూర్తినిచ్చిందని త్రివిక్రమ్ కొనియాడారు. మొత్తానికి ఆనాటి సాఫ్ట్ ‘వసంతం’ వెంకటేష్‌కు, ఈనాటి వైలెంట్ ‘ఏకే 47’ వెంకటేష్‌కు మధ్య ఉన్న వేరియేషన్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
-
RRB Jobs : రైల్వేలో 1,265 ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేటి నుంచే అవకాశం
-
OTR: మాగంటి బాబును పక్కన పెట్టిన టీడీపీ పెద్దలు.! మాగంటి రాజకీయానికి బ్రేక్ పడినట్టేనా?
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!