Site icon NTV Telugu

Venkatesh : రానా నాయుడు సీజ‌న్ 2 అప్‌డేట్‌..

Rana Naidu

Rana Naidu

వెంకటేష్, రానా కాంబోలో తెరకెక్కిన ‘రానానాయుడు’ వెబ్ సిరీస్ ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. 2023 మార్చిలో రిలీజ్ కాగా బోల్డ్ అంశాల‌తో ఈ సిరీస్‌ను తెర‌కెక్కించిన తీరుపై చాలా విమ‌ర్శలు వ‌చ్చాయి. ఫ్యామిలీ హీరోగా వెంక‌టేష్‌కు ఉన్న ఇమేజ్‌ను ఈ సిరీస్ కొంత డ్యామేజ్ చేసింది. దాంతో సెకండ్ సీజ‌న్‌లో బోల్డ్‌నెస్ బాగా త‌గ్గించిన‌ట్లు స‌మాచారం. ఇక ‘రానా నాయుడు’ సీజ‌న్ 2కు సంబంధించిన షూటింగ్ పార్ట్ చాలా రోజుల క్రిత‌మే పూర్తయినట్లు వార్తలు వినిపంచగా.. తాజాగా ఈ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ వైరల్ అవుతోంది. డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నల‌గ‌డ్డ నటించిన ‘జాక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌కు రానా ద‌గ్గుబాటి ముఖ్య అతిథిగా హాజ‌రు కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రక‌టించింది. కానీ వేడుక‌లో రానా ద‌గ్గుబాటి క‌నిపించ‌లేదు. అయితే

Also Read: Kavya Thapar : తిరిగి ఫామ్ లోకి వచ్చిన హాట్ బ్యూటీ..

రానా ద‌గ్గుబాటి రాకపోవడం పై ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్ధు జొన్నల‌గ‌డ్డ క్లారిటీ ఇచ్చాడు. రానా ముంబాయిలో ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌కు డ‌బ్బింగ్ పనిలో ఉన్నాడు అని తెలిపాడు. ఇక ప్రస్తుతం వెంక‌టేష్‌తో పాటు రానా త‌మ పాత్రల‌కు డ‌బ్బింగ్ చెబుతోన్నట్లు తెలిసింది. అంతే కాదు  మే నెల‌లోగా ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు మొత్తం కంప్లీట్ చేసి, జూన్‌లో ఈ వెబ్‌సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల‌నే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ ఉన్నారట. కాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సీజ‌న్ 2లో వెంక‌టేష్‌, రానాతో పాటు అర్జున్ రాంపాల్‌, కృతి క‌ర్భందా, సుర్వీన్ చావ్లా కీల‌క పాత్రల్లో క‌నిపించ‌బోతున్నారు. యాక్షన్ క్రైమ్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌కు క‌ర‌ణ్ అన్షుమాన్‌, సూప‌ర్న్ వ‌ర్మ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు.

Exit mobile version