టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్, తన నటనతో త్వరగానే హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవలే విడుదలైన ‘కింగ్‌డమ్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల మనసు గెలుచుకున్న దర్శకుడు వెంకటేష్ మహా, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో భావోద్వేగ కథలు చెప్పడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read : NTR : ఎన్టీఆర్ తప్పించుకున్నాడు, నితిన్ బుక్కైపోయాడు..!
చాలా కాలం గ్యాప్ తర్వాత ఆయన తన కొత్త సినిమాను ప్రకటించారు. ఆర్‌బీ (RB) అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో సత్యదేవ్ హీరోగా నటించనున్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, శ్రీచక్ర ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లపై సూపర్ స్టార్ మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇందులో భాగంగా తాజాగా చిత్రయూనిట్ సమాచారం ప్రకారం, ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను రేపు మధ్యాహ్నం 12.12 గంటలకు సోషల్ మీడియాలో విడుదల చేయనున్నారు. ఈ కాంబినేషన్‌పై అభిమానులు, సినీ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది.